ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారు ఇటివల లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన గజల్ శ్రీనివాస్ కు దిమ్మతిరిగే షాకిచ్చారు .తన దగ్గర పనిచేసే వెబ్ రేడియో జాక్ తనను లైంగిక వేధిస్తున్నారు .ఇప్పటికే చాలా ఓపిక పట్టాను .రోజు రోజుకు ఎక్కువతున్న అతని లైంగిక వేధింపులు భరించలేక పక్కా ఆధారాలతో గజల్ శ్రీనివాస్ నిజస్వరూపాన్ని వెలుగులోకి తీసుకొచ్చాను ..
అని అంటూ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో పక్క ఆధారాలతో గజల్ పై లైంగిక వేధింపు కేసు పెట్టిన సంగతి తెల్సిందే .దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన సంగతి తెల్సిందే .
అయితే ఇప్పటికే సేవ్ టెంపుల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఆ సంస్థ గజల్ ను తొలగించింది .తాజాగా ఏపీ ప్రభుత్వం స్వచ్చంధ్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్ గా గజల్ ను తొలగిస్తూ ఉత్తర్వులను జారీచేసింది .గత ఏడాది మే 28న గజల్ ను స్వచ్చంధ్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్ గా గజల్ ను టీడీపీ సర్కారు నియమించింది .