ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. జగన్ తో పాటు ప్రజలు పాదయాత్రకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ..ఆయనతో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. అయితే కడప ,కర్నూల్ ,అనంతపురం తరువాత 53 రోజులుగా సాగుతున్న ఈ పాదయాత్రలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పాదయాత్ర చేస్తున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతున్న జగన్.. చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. బాబుకు అసలు ఎందుకు ఓటు వేయాలంటూ ఆయన అడుగుతున్న ప్రశ్నలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఈరోజు రేషన్ షాపుల్లో బియ్యం తప్ప మరేమీ ఇవ్వ నందుకా?బ్యాంకుల్లో పెట్టిన రైతుల బంగారం వారి ఇంటికి రానందుకా? ఈ నాలుగేళ్లుగా నిరుద్యోగ భృతి కింద రాష్ట్రంలో ఇంటింటికీ రూ.90 వేలు బాకీ పడినందుకా? పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మల రుణాలు ఒక్క రూపాయి కూడా మాఫీ కానందుకా? పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇస్తామని ఇల్లు కట్టి ఇస్తామని చెప్పి ఇవ్వనందుకా? అన్నదాతల రూ.87612 కోట్ల రుణాలు మాఫీ కానందుకా? అప్పు చెల్లించాలని బ్యాంకులు రైతుల ఇళ్లకు నోటీసులు వస్తున్నందుకా? మీరిస్తున్న సొమ్ము అప్పులకు అయిన వడ్డీకి కూడా సరిపోనందుకా? వీరికెవ్వరికీ బ్యాంకులు సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వనందుకా? ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి మాట నిలుపుకోనందుకా? ఓటుకు కోట్లు కేసు నుంచి బయట పడటానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టినందుకా? మట్టి.. ఇసుక.. మద్యం.. బొగ్గు మొదలు రాజధాని భూములు – గుడి భూములనూ వదలకుండా అవినీతికి పాల్పడుతున్నందుకా? జన్మభూమి కమిటీలను మాఫియాగా మార్చి ప్రజలను పీడిస్తున్నందుకా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేగాక జగన్ కు అంత జనభా వస్తునారు…2019లో సిఎం అయ్యోటట్లు సంకేతాలు ఉన్నందుకే టీడీపీ నేతలు దారుణంగా జగన్ ను విమర్శిసిస్తున్నారు. కాని ప్రజలు జగన్ వైపు చూస్తున్నారు.