ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ)కి దరఖాస్తుచేసిన అభ్యర్థులు తమ వివరాలను ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు సవరించుకోవచ్చని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు . దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు ఆన్లైన్లో పీడీఎఫ్ సవరించుకోవాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. గడువుతీరిన తర్వాత అభ్యంతరాలు స్వీకరించబోమని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు తుదిగడువు ఆదివారంతో ముగుస్తున్న సంగతి తెలిసిందే.
