తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు..పర్యటనలో భాగంగా అశ్వాపురం మండలం పాములపల్లి గ్రామం దగ్గర జరుగుతున్న మిషన్ భగీరథ పనులను మంత్రి శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.మిషన్ భగీరథ కింద తాగునీరు అందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని సాహసోపేతమైన ప్రకటన చేసిన దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం వచ్చే ఎన్నికల్లోపు తాగునీరు అందిస్తామన్నారు.
