ఈ మధ్య కాలంలో ఆపరేషన్ థియేటర్లో.. వైద్యుల మధ్య గొడవ తలెత్తడం.. వారి కోపాన్ని పేషెంట్‌పై చూపించి రోగి ప్రాణాన్ని తీయడం కామనైపోయింది. అయితే, ఆపరేషన్ థియేటర్లో మొదలైన గొడవ ఒక ప్రాణాన్నే తీస్తుంది. కానీ అదే గొడవ ఆకాశంలో ప్రయాణించే విమానంలో తలెత్తితే.. అమ్మో.. ఊహించడానికే భయంకరంగా ఉంది కదా..!
ఊహించడానికే భయానకంగా ఉండే ఈ సంఘటన నిజంగానే జరిగింది. ఫ్లట్లో కెప్టెన్‌కు, కో పైలట్‌కు మధ్య గొడవ మొదలైంది. దీంతో ఖంతుతినడం ప్రయాణికుల వంతైంది. అసలు విషయానికొస్తే.. లండన్ నుంచి ముంబై మధ్య నడిచే జెట్ ఎయిర్ వేస్ 324 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న సమయంలో ఫ్లైట్‌లో ఉండే కెప్టెన్‌కు, కో పైలెట్‌కు మధ్య వివాదం తలెత్తింది. కాగా, కో పైలెట్ ఒక లేడీ కావడం గమనార్హం. వారిద్దరి మధ్య తలెత్తిన గొడవ కాస్తా చిలికి.. చిలికి కాస్త పెద్దదైంది. ఇద్దరూ లేచి పరస్పరం గొడవకు దిగారు. ఇంతలో కెప్టెన్ లేడీ పైలెట్ చెంపను చెల్లుమనిపించాడు. దీంతో కో పైలెట్ చేసేది లేక కాక్ పిట్ రూంకు వెళ్లిపోయింది.
కెప్టెన్క కూడా కో పైలెట్‌ను వెంబడించారు. ఇదంగా గమనించిన ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే.. ఫ్లైట్‌ను నడిపే వారిద్దరూ ఇలా కాక్‌పిట్ రూంకు వెళ్లిపోవడమే. భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు ఒక్కసారిగా అరుపులు, కేకలు వేయడంతో కాక్‌పిట్ రూంలోనుంచి ఇద్దరిని బయటకు ర్పించేందుకు తీవ్రంగా యత్నించారు.. ప్రయాణికులు. బ్రతిమిలాడి.. బుజ్జగించి కాక్‌పిట్ రూం నుంచి వారిద్దరిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయాణికులు చేయని ప్రయత్నమంటూ లేదు. చివరకు ఇద్దరూ బయటకు రావడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. చివరకు ఫ్లట్‌ను సేఫ్‌గా ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు.
ఇదిలా ఉంటే.. ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డ ఫ్లైట్ కెప్లెన్.. కో పైలెట్‌పై జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని విధుల నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా.. ఘటనపై విచారణకు ఆదేశించింది.