ప్రస్తుతం దక్షిణాది వెండితెరపై తళుక్కున మెరిస్తున్న మెరుపుతీగ ఎవరంటే టక్కున గుర్తొచ్చేది కమల్ హాసన్ కుమార్తె శ్రుతిహాసన్.. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు దాదాపు అన్ని సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయినా ఒడిదుడుకులు మాత్రం తప్పట్లేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికి ఓపికతో ముందుకు సాగి నంబర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా తనదైన శైలిలో ముద్ర వేస్తూ ముందుకు దూసుకెళ్తోంది.
అయితే..
శ్రుతి హాసన్ శ్రుతి మించిపోయిందంటూ సోషల్ మీడియాలో ఒకటే చర్చ జరుగుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో శ్రుతి హాసన్ తన బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ తో కలిసి నైట్ డ్రెస్సులో దర్శనమిచ్చింది. ఇంకేముంది ఆమె ఆ రాత్రంతా అతడితో గడిపేసిందంటూ సోషల్ మీడియాలో ఒకటే చర్చ నడుస్తోంది. దీనిపై శ్రుతి హాసన్ మాత్రం పెదవి విప్పడంలేదు. ఇదిలావుంటే గతంలో శ్రుతి హాసన్ తన బాయ్‌ఫ్రెండ్ మైఖేల్‌తో కలిసి కారులో కనిపించింది. అప్పుడు అతడితో డేటింగ్ చేస్తుందా అనే కామెంట్లు వినిపించాయి. కానీ దానిపై శ్రుతి హాసన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇటీవలే తన బోయ్‌ఫ్రెండ్‌తో కలిసి తల్లి సారికతో కనిపించిన ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి.బాయ్ ఫ్రెండ్ మైఖేల్‌ను వెంటబెట్టుకుని తన తల్లి సారికతో కలిసి నడుస్తూ వున్న ఫోటోల చర్చనీయాంశంగా మారాయి. అఫీషియల్‌గా ఇలా ఫోటోల్లో కనిపిస్తుందంటే ఇక పెళ్లి చేసుకోవడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.