తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. బాలింతల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ బ్లడ్‌బ్యాంకులను వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయనుంది.మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 26 బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేస్తుంది.ఈ నేపధ్యంలో జాతీయ ఆరోగ్య మిషన్ అద్వర్యంలో 13, రాష్ట్ర వైద్య విధాన పరి షత్ ఆధ్వర్యంలో మరో 13 బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నారు.
పేదలకు ఉపయోగపడేందుకు వీలుగా ప్రభుత్వ ఆస్పత్రుల ప్రాంగణంలోనే వీటి నిర్మాణం జరుగుతోంది. కాన్పు సమయంలో అధిక రక్తస్రావం జరిగే సందర్భాల్లో ఒక్కోసారి 2 నుంచి 10 యూనిట్ల వరకు రక్తం అవసరమవుతోంది. సరిపడా రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల కొన్నిసార్లు బాలింత మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు.
భూపాలపల్లి, అచ్చంపేట, మల్కాజ్‌గిరిలోని బ్లడ్ బ్యాంకులను జనవరి 15న ప్రారంభించేందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.ఈ 26 కొత్త బ్లడ్ బ్యాంకుల్లో 6 నెలల్లోపు పూర్తి స్థాయి సేవలు ప్రారంభం కానున్నాయి.రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి