Home / SLIDER / ఈ ఏడాది రాష్ట్రావతరణ కానుక ఏంటో చెప్పిన మంత్రి కేటీఆర్‌

ఈ ఏడాది రాష్ట్రావతరణ కానుక ఏంటో చెప్పిన మంత్రి కేటీఆర్‌

హైద‌రాబాద్ మెట్రో ఖాతాలో మ‌రో ప్ర‌త్యేక‌త న‌మోదు కానుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా రాబోయే జూన్ 2వ తేదీ ప్రజలకు కానుకగా ఎల్బీనగర్ వరకు మెట్రో మార్గాన్ని ప్రారంభించి తీరుతామని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు.  ఎల్బీనగర్ వరకు మెట్రో ప్రారంభించే దిశగా ప్రత్యేక లక్ష్యంతో నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. మెట్రోను దశలవారీగా అందుబాటులోకి తీసుకొచ్చి నగరంలోట్రాఫిక్ కష్టాలు లేకుండా చేస్తామన్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వం సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు అందుకునే దిశగా ఒక్కో కార్యక్రమం చేసుకుంటూ పోతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. అభివృద్ధిని ప్రోత్సహించాల్సిందిపోయి కుసంస్కారంతో చిల్లరమల్లర విమర్శలు చేసే పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. తమకు బాసులు ఢిల్లీలో, పక్క రాష్ట్రంలో లేరని, రాష్ట్ర ప్రజలే తమకు బాసులన్నారు. ప్రజలకు జవాబుదారితనంగా ఉంటామే తప్ప దారిన పోయే దానయ్యలకు జవాబు చెప్పాల్సిన పనిలేదన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat