తెలంగాణ నాన్ గజిటెడ్ అధికారుల సంఘం నూతన సంవత్సరo- 2018 డైరిని ఆవిష్కరించారు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత.
నిజామాబాద్ లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శనివారం నిజామాబాద్ శాఖ వారి స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వి.జి గౌడ్, నిజామాబాద్ అర్భన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, అర్ముర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి , టిఎన్జీవోస్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ రావు, అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ధఫెదార్ రాజు, నిజామాబాద్ మేయర్ ఆకుల సుజాత, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రామ్ మోహన్ రావు, జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి , టీఎంజీఓ ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్, మహిళ చైర్ పర్సన్ రేచల్,నిజామాబాద్ జిల్లా టీఎన్జిఓస్ అధ్యక్షులు అలుక కిషన్, నగర శాఖ అధ్యక్షులు ప్రతాప్, కొండల్ రెడ్డి, టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదన్నగారి విఠల్ రావు పాల్గొన్నారు.