ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్ జవహర్ మరో సారి విమర్శల వర్షం గుప్పించారు. అయితే.. మంత్రి జవహర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ ప్రజా సంకల్ప యాత్ర.. ఒక ఓదార్పు యాత్రలాగా సాగుతుందన్నారు. ఎవరైనా మహిళలు జగన్ వద్దకు పోతే ముద్దులు పెడుతున్నాడని, అందుకనే 40 సంత్సరాలలోపు ఉన్నవారు ఎవరూ కూడా జగన్ పాదయాత్రలో పాల్గొనడం లేదన్నారు.
వారంతా జగన్ ముద్దులకు చాలా దూరంగా ఉంటున్నారన్నారు. ఆఖరికి చిన్న పిల్లలు కూడా జగన్పెట్టే ముద్దులకు భయపడి జగన్ పాదయాత్రలో అస్సలు పాల్గొనడం లేదన్నారు. జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర.. చివరకు ముద్దుల యాత్రలాగా తయారైందని ఎద్దేవ చేశారు ఏపీ ఎక్సైజ్‌శాఖ మంత్రి జవహర్.
అసలు జగన్‌కు సీఎం అయ్యే అర్హత లేదని, 16 నెలలు జైలు కెళ్లడం ముఖ్యమంత్రికి కావాల్సిన అర్హత కాదని విమర్శించారు. విజయమ్మకు ఆమె కొడుకు వైఎస్ జగన్ ముద్దు రావచ్చుకానీ.. దాన్ని ప్రజలమీద రుద్దడం సబబు కాదంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.