ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పుంగనూర్ మండలంలో కల్లూరు లో పాదయాత్ర చేస్తున్నారు .ఈ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన మైనార్టీ సదస్సులో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టో లోఒక్కో పేజీలో ఒక్కొక్క కులానికి హామీలను కురిపించారు చంద్రబాబు నాయుడు .
తీరా అధికారంలోకి వచ్చి నాలుగు ఏండ్లు అవుతున్న కానీ గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు వందల ఎన్నికల హామీలలో ఒక్కటి కూడా నేరవేర్చలేదు .అంతటితో ఆగకుండా ఎన్నికల హామీల గురించి ప్రశ్నిస్తే తాటా తీస్తా..జైల్లో పెడతా అని అంటూ బెదిరింపులకు దిగుతున్నారు అని జగన్ ఆరోపించారు.తమను గెలిపిస్తే మైనార్టీ వర్గం కోసం సబ్ ప్లాన్ తీసుకొస్తాం .ఇమామ్ లకు రూ.పది వేలు ,మౌసమ్ లకు రూ.ఐదు వేలు అందజేస్తామని జగన్ చెప్పారు .
పేద మైనార్టీ విద్యార్ధులకు కేజీ నుండి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను జగన్ బాబు సర్కారును డిమాండ్ చేశారు.ఆరోగ్య శ్రీలో సమూల మార్పులను తీసుకొస్తామని ..ఇతర ప్రాంతాల్లో వైద్యం చేసుకుంటే వారికి ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తామని జగన్ అన్నారు .దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి రూ.పదివేలు పెన్షన్ అందిస్తామని తెలిపారు .చిన్నపిల్లలకు చదువుకు భరోసా ఇవ్వడమే అసలైన ప్రేమ అని ..ఆ ప్రేమను తను అందిస్తా ..వారిని చదివించడమే కాకుండా ఏకంగా ఖర్చుల కోసం ఇరవై వేలు రూపాయలు ఇస్తామని తెలిపారు ..