ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు గురైన మహిళల జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. కాగా, నిన్న గజల్ శ్రీనివాస్ తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. మరో పక్క గజల్ శ్రీనివాస్‌ను నాలుగు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.
అయితే, రోజులు గడిచేకొద్ది గజల్ శ్రీనివాస్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే గజల్ శ్రీనివాస్ రాసలీలపై ముమ్మరంగా విచారణ చేస్తున్న పోలీసులు… గజల్ శ్రీనివాస్ బాధితుల నుంచి.. అనుచరుల నుంచి.. తెలిసిన, దగ్గరి బంధువుల నుంచి ఆధారాలను సేకరిస్తున్నారు.
అసలు విషయానికొస్తే.. గజల్ శ్రీనివాస్‌కు సంబంధించిన కొన్ని వివరాలను.. గజల్ శ్రీనివాస్ దగ్గరి బంధువు ఒకరు పోలీసులకు వివరాలను అందించారట. ఆ వివరాల ప్రకారం.. గజల్స్ పాడటంలో ప్రావీణ్యం పొందిన శ్రీనివాస్ డబ్బు బాగానే సంపాదించాడు. అయితే, బాగా డబ్బు సంపాదించిన గజల్ శ్రీనివాస్‌కు పాటలు పాడుతున్నాం.. రోజూ ఇంటికి వస్తున్నాం.. భార్యా పిల్లలతో బతకడం సర్వ సాధారణం అని ఆలోచించాడు. జీవితంలో ఏదో ఒక స్పెషల్ ఉండాలని ఆలోచన తట్టగానే.. వెంటనే తన మైండ్‌సెట్‌లో పార్వతి పేరు తట్టింది. అయితే, పార్వతి గత 20 ఏళ్లుగా గజల్ శ్రీనివాస్ ఇంట్లో పనిచేస్తోంది. ఎలాగో ఇంట్లో తన భార్య ఉంటుంది.. కాబట్టి.. పార్వతిని తన ఆఫీస్‌లో పనిచేసేలా తన భార్యను ఒప్పించాడు గజల్ శ్రీనివాస్.
ఇలా పార్వతిని తన ఇంటిపనికి, కార్యాలయం, ఒంటి పనికి వాడుకున్నాడు గజల్ శ్రీనివాస్. దాదాపుగా 20 ఏళ్లుగా సాగిన గజల్ శ్రీనివాస్ రాసలీలల జీవితం ఒక్కసారిగా వీడియో లీక్ కావడంతో.. బహిర్గతమైంది. అవును మరి. మనిషి ఎంత తెలివి కలవాడైనా.. అతని బలహీనతలే.. అతన్ని పట్టిస్తాయి.. అంతేగాక చివరకు చిప్ప కూడు తినేలా చేస్తాయి అంటూ గజల్ శ్రీనివాస్‌కు సంబంధించి సోషల్ మీడియాలో కా మెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.