దాదాపు ఏడాదికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పడుతున్న నిరీక్షణకు తెరపడనుంది. ప్రధాని నరేంద్రమోడీతో ఈ నెల 12న చంద్రబాబు భేటీ జరగనుందని సమాచారం. ఈ భేటీలో ఇరువురి మధ్యా పోలవరం సహా పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం, బీజేపీ ఎంపీలు ప్రధాని నరేంద్రమోడీని నిన్న కలిశారు .
ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు, నియోజకవర్గాల పెంపు సహా విభజన చట్టంలో పెండింగ్ అంశాల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో రెండు మూడు రోజుల్లో సమావశమై అన్ని అంశాలనూ కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఇరువురి భేటీ ఈ నెల 12న జరగనుంది. ఈ భేటీలో పోలవరం, రాష్ట్రంలో నియోజకవర్గాల పెంపు, విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న అంశారు, నవ్యాంధ్రరాజధానికి ఆర్థిక చేయూత తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Post Views: 236