తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలోనే రెండో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు పురస్కారం దక్కింది.
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ చేతుల మీదుగా పంజాగుట్ట ఎస్.హెచ్.ఓ రవీందర్ ఈ పురస్కారం అందుకున్నారు.మధ్యప్రదేశ్ లోని తేకన్ పూర్ లో ఉన్న బీఎస్ఎఫ్ అకాడమీలో జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల వార్షిక సమావేశంలో ఈ ట్రోఫీ ప్రధానం చేశారు.
రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా సర్వే చేసి దేశంలో 10 అత్యుత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేశాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్, టెక్నాలజీ వినియోగం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ పురస్కారం ఇచ్చారు.