నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రముఖ యాంకర్ ప్రదీప్ పట్టుబడిన విషయం తెలిసిందే.. అయితే ఆరోజు నుంచి సోషల్ మీడియాలో యాంకర్ ప్రదీప్ పై పలు రకాలుగా వార్తలు వస్తున్నాయి.బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో 178 పాయింట్లు నమోదు అవడం.. తన కారుకు బ్లాక్ ఫిలింను వేయించడం…పోలీసుల కౌన్సిలింగ్‌కు హాజరు కాకపోవడంతో ప్రదీప్‌పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తున్నది.
అయితే.. అదే సోషల్ మీడియాలో ప్రదీప్ అభిమాని హనీ భవాని … “సార్ మా యాంకర్ ప్రదీప్ ని ఒగ్గేయండి పాపం చిన్నపిల్లోడు తెలిక చేసేశాడు..” అంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు చేసిన పోస్ట్‌కు కామెంట్ పెట్టారు.
ఆ కామెంట్‌కు తమదైన శైలిలో స్పందించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది… “ఎవరినీ కించపరచడం లేదు.. చిన్నపిల్లోడు అయితే పాలు తాగాలి కాని మందు తాగి నడపడం కరెక్ట్ కాదు కదా? సెలబ్రిటీస్ అందరికీ ఆదర్శంగా ఉండాలి.. అడ్మిన్ హెచ్” అంటూ ఆ అభిమాని కామెంట్‌కు కౌంటర్ ఇచ్చారు. ఇక.. ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.