ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అదినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. అయితే ఈ పాదయాత్రకు పోలీసులు నిఘా పెంచారట.దానికి కారణం ఆయన భద్రత గురించి కాదట.జగన్ వద్దకు వస్తున్న వారిలో ఎవరెవరు ఉంటున్నారో తెలుసుకుని అధికార పార్టీకి అందించడానికట.ఈ మేరకు ఒక వచ్చిన ఒక కదనం ఆసక్తికరంగా ఉంది.ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజా సంకల్పయాత్రకు పెరుగుతున్న ఆదరణ చూసి టీడీపీ ప్రభుత్వంలో అలజడి మొదలైంది. చంద్రబాబు సొంత జిల్లాలో వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ కి ప్రజా సంకల్పయాత్రలో విశేష ఆదరణ పెరుగుతుండటంతో ప్రభుత్వం నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. డోన్ కెమెరాలను, బాడీ కెమెరాలను పెట్టి ప్రతీ అడుగును చిత్రీకరించేందుకు నిఘా ఏర్పాటు చేశారు.పాదయాత్రకు సంబంధించి ఎవరెవరు వైఎస్ జగన్‌ను కలుస్తున్నారనే విషయాలను తెలుసుకుంటున్నారు.”
