వెలుగు జిలుగుల తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల వల్లే సాధ్యమయిందని పలువురు వక్తలు ప్రశంసించారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ అకౌంట్స్ స్టాఫ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 2018 డైరీ అవిష్కరణ జరిగింది. ఈ సభకు శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరై డైరీ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, సీఎండీ రఘుమారెడ్డి ఉద్యోగులు పాల్గొన్నారు.
శాసనసభ స్పీకర్ మాదాసుధానాచారి మాట్లాడుతూ `24 గంటల విద్యుత్ ఇస్తున్న మీ అందరికి కృతజ్ఞతలు. ఆనాడు ప్రతి అంశాన్ని ఒక్క ఆయుధంగా తీసుకొని ఉద్యమంలో ముందుకు పోయాం. తెలంగాణ వస్తే మీకు నీళ్లు లేవు ,నిధులు లేవు …కరెంట్ ఎడికెలి వస్తది అని హేళన చేసిన రోజుల నుండి రాష్ట్రం వచ్చాక మొదటగా సాధించింది విద్యుత్…తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు తక్కువ సమయంలో అధిగమించి రాత్రింభవళ్ళు శ్రమించి 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఘనత మీకే దక్కుతుంది` అని ప్రశ్నించారు. `గతంలో కరెంట్ ఉంటే వార్త….ఇప్పుడు కరెంట్ పోతే వార్త… గతంలో తెలంగాణ వస్తే కరెంట్ తిగలపైన గుడ్డలు అరేసుకోవాలి అని ఎవరు అన్నారో వారే ఇప్పుడు మనవైపు చూస్తున్నారు. తెలంగాణ వచ్చాక మనం ఛాలెంజ్ చెయ్యకలుగుతున్నాం విద్యుత్ కోతలు లేని రాష్ట్రం మన రాష్ట్రం అని ..ప్రతీది సాదించుకుంటు ముందుకు పోతున్నాం …మిషన్ కాకతీయ ద్వారా సాగునీరు …మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం.` అని ప్రశంసించారు.
ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ సంఘం ఉద్యమంలో పుట్టిన సంఘమని అన్నారు. అప్పట్లో డైరీ అవిష్కరిస్తే నవ్వేవారని తెలిపారు. `విద్యుత్ ఉద్యోగులు అంటే రైతులకు ,పబ్లిక్ కోపం వచ్చేది. మన బ్రతుకుదేరువే కరెంట్… ఎందుకంటే ప్రతిది విద్యుత్ పైన ఆధారపడి ఉంటుంది. ఆనాడు విద్యుత్ ప్రైవేట్ వ్యక్తుల నుండి ఎక్కువకు విద్యుత్ కొనేవారు. వచ్చే సంవత్సరం నాటికి ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ఇవ్వాలి….మొదట మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలి ఎందుకంటే రాష్ట్రం వస్తే తెలంగాణ లో విద్యుత్ ఉండదు అన్నారు…కానీ ఇప్పుడు 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం మన సత్తా చూపించాం. ఈ సంస్థను మరింత లాభాల బాటలో నడపాలని నేను కోరుకుంటున్నాను.` అని ఆకాంక్షించారు.