ఏపీ రాజకీయాల్లో నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి మాజీ ఎమ్మెల్యే దగ్గర నుండి ప్రస్తుత ఎమ్మెల్యే వరకు ..మాజీ ఎంపీ నుండి ఎంపీ వరకు అందరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీలోకి క్యూ కడుతున్న పలు సంఘటనలు చూశాం .తాజాగా సీన్ రివర్స్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి .అందులో భాగంగా చంద్రబాబు సొంత ఇలాఖ అయిన చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ ఒకరు వైసీపీ గూటికి రావడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి .ప్రస్తుతం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను చిత్తూరులో ఉన్న సంగతి తెల్సిందే .
ఇందులో భాగంగా జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈక్రమంలోనే జగన్ కుప్పం నియోజకవర్గం నుండి వైసీపీ తరపున పోటీచేసే అభ్యర్ధిగా కుప్పం వైసీపీ పార్టీ సమన్వయ కర్త అయిన చంద్రమౌళిని నిలబెడుతున్నాను .మీరంతా చంద్రమౌళి అన్నను బంపర్ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే క్యాబినెట్ లో మంత్రి పదవిచ్చి నాపక్కన కూర్చోబెట్టుకొని మీకు న్యాయం జరిగేవిధంగా చూస్తాను అని హమిచ్చారు .అయితే చిత్తూరు టీడీపీ పార్టీ ఎంపీ శివప్రసాద్ వైసీపీలో చేరతారు అని జిల్లా రాజకీయాల్లో ముఖ్యంగా టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ . ఇటివల ఒక సమావేశంలో ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం ఓట్లతో మాత్రమే ఎంపీగా గెలవలేదు .
తన సతీమణి రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓటర్ల సహాయంతో గెలిచాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు .అయితే శివప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యల వెనక ఆయన పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు .ఇప్పటికే వెలువడిన పలు సర్వేలల్లో కూడా టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోవడం ..గత నాలుగు ఏండ్లుగా టీడీపీ పార్టీ తన సామాజిక వర్గానికిచ్చిన హామీలను తుంగలో తోక్కడమే కాకుండా మంత్రి పదవుల నుండి తప్పించడం ..ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ మీద వెనక్కి తగ్గడం ..పోలవరం ప్రాజెక్టులో భారీ కుంభ కోణాలు జరగడం ఇవన్ని ఎంపీ శివప్రసాద్ ను తీవ్ర ఆలోచనలో పడేసినట్లు ఆయన అనుచరవర్గం అంటున్నారు .జగన్ పాదయాత్ర ముగిసేలోపు వైసీపీలో చేరొచ్చు అని జిల్లా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .చూడాలి మరి ఎంపీ శివప్రసాద్ వైసీపీలోకి వస్తారో ..టీడీపీలో ఉంటారో ..?.