తరగతి గదిలో ఓ విద్యార్థిని మెడలో తాళి కడుతున్న బాలుడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. దీంతో బాలల హక్కుల సంరక్షణ సంస్థల ప్రతినిధులు, పోలీసులు ఆ జంట కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 29 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ బాలుడు చేతిలో తాళి పట్టుకుని ‘అమ్మా’ అంటూ మొబైల్ వైపు చూస్తాడు. ఆ వెంటనే ‘తాళి కట్టరా’ అంటూ తమిళంలో మహిళ గొంతు వినిపిస్తుంది. ఆ వెంటనే స్కూలు యూనిఫాం ధరించి ఉన్న సదరు బాలిక మెడలో ఆ బాలుడు తాళి కట్టేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో హల్చల్ చేస్తుండడంతో బాలల హక్కుల సంరక్షణ సంస్థల ప్రతినిధులు, పోలీసులు ఈ జంట కోసం ముమ్మర గాలింపు మొదలుపెట్టారు. వీడియోలో కనిపిస్తున్న బాలిక ప్రభుత్వ పాఠశాల యూనిఫాం ధరించి ఉందని, అన్ని ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థినులూ అదే యూనిఫాం ధరిస్తారు కాబట్టి ఈ ఘటన ఏ స్కూలులో జరిగిందో కనుక్కోవడం కష్టతరంగా మారిందని చెప్పారు.
Tags love marrige school room students tamilanadu
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023