ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీలో ప్రసారమై జబర్దస్త్ కార్యక్రమంతో ఫుల్ పాపులర్ అయ్యాడు శాంతి స్వరూప్ .అయితే తను ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను అని ఆయన తెలిపాడు .ఒక ప్రముఖ మీడియా ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ జబర్దస్త్ కార్యక్రమానికి ముందు తను ఎన్నో కష్టాలు పడ్డాను అని ఆయన తెలిపారు .
ఒకానొక సమయంలో తను ఉంటున్న రూమ్ కి కూడా రెంట్ కట్టుకోలేని పరిస్థితి వచ్చింది .ఆ సమయంలో ఏడుపు ఒక్కటే తక్కువైంది .ఓనర్ టార్చర్ భరించలేక తెల్సినవాళ్ళను ..తెలియని వాళ్ళను అడిగి మరి రూమ్ రెంట్ కట్టుకునేవాడ్ని ఆయన ఎదుర్కున్న కష్టాల గురించి ఏకరవు పెట్టాడు స్వరూప్ .ఒకసారి రెంట్ కట్టుకోలేక బ్రతిమిలాడుకొని మరి వేరే వాళ్ళ రూమ్ లోకి వెళ్ళాను .అయితే అక్కడ ఎంతో అనుకూలంగా ఉన్న కానీ నాకు ఇబ్బందులు ఎదురయ్యాయి .
అందుకే ఏకంగా రూమ్ లో నుండి వెళ్లి పొమ్మన్నారు .పోకపోతే నా బ్యాగ్ తీసి బయటపడేశారు .దాంతో ఎక్కడకి వెళ్ళాలో అర్ధం కాక నడి రోడ్డు మీదున్న కూర్చొని ఏడిచాను .అప్పుడు నాకు పరిచయం ఉన్న దర్శకుడు చౌదరిగారికి ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్ళి తన ఫ్రెండ్ రూమ్ లో ఉంచారు .ఇలా దాదాపు తొమ్మిది నెలల పాటు నా రూమ్ రెంట్ చౌదరి కట్టారు అని ఆయన ఎదుర్కున్న కష్టాలను చెప్పాడు స్వరూప్ .. ‘