ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు గురైన మహిళల జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. కాగా, ఇవాళ గజల్ శ్రీనివాస్ తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరో పక్క గజల్ శ్రీనివాస్‌ను నాలుగు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఇలా గజల్ శ్రీనివాస్ కేసు విచారణ జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. గజల్ శ్రీనివాస్ కుమార్తె గురించి మీకు తెలియని నిజాలంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అయితే, గజల్ శ్రీనివాస్‌కు కూతురు పేరు సంస్కృతి. గజల్ శ్రీనివాస్‌లానే.. తన కూతురు సంస్కృతి కూడా గజల్స్ పాడుతూ అందర్నీ అలరిస్తోంది. అంతేగాక, దేశ విదేశాల్లో ఆమె విడుదల చేసిన ఆల్బమ్స్ చాలా ప్రాచూర్యం పొందిన విషయం అందరికీ తెలిసిన విషయమే.
అయితే, గజల్స్ సంస్కృతి 2005 నుంచి గజల్స్ పాడుతోంది. ఇప్పటికే ఆమెకు అనేక అవార్డులు, దివార్డులు కూడా అందుకుంది. అందుకుంటోంది. అంతేగాక, ఇటీవల జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఆమె ఉత్తమ అవార్డును అవార్డు అందుకుంది. అలాగే వైశ్విక ఫౌండేషన్ ఇటీవల ఆమెకు ముంబైలో యువ ప్రతిభా పురస్కారాన్ని కూడా అందజేసింది.