కొత్త ఏడాది మొదటి నెల మొదటి వారాంతంలో దేశీయ మార్కెటు సూచీలు అదరగొట్టాయి. కొత్త రికార్డు్ల్లో స్థిరపడ్డాయి. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో పాటు దేశీయ సంస్థల్లో కొనుగోళ్లు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరచడంతో మార్కెటు సెన్సెక్స్ మళ్లీ 34వేల మార్క్‌ను దాటింది ..
నిఫ్టీ కూడా సరికొత్త జీవనకాల గరిష్ఠానికి చేరుకుంది.కొనుగోళ్ల అండతో ఈ ఉదయం 100 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ ఉత్సాహంగా ట్రేడింగ్‌ను ఆరంభించింది. బ్యాంకింగ్, టెలికాం, ఐటీ రంగాల షేర్లు రాణించడంతో ఆద్యంతం అదే జోరును కొనసాగించింది. ఒకానొక దశలో 200 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అయ్యింది.
చివరకు 184 పాయింట్ల లాభంతో 34,154 వద్ద సరికొత్త రికార్డులో స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 54 పాయింట్లు లాభపడి 10,559 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.63.40గా కొనసాగుతోంది.