భారీ బడ్జెట్‌తో.. భారీ మల్టీస్టారర్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి ఇచ్చిన కిక్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న రాజమౌళి తన తండ్రి చెప్పిన స్టోరీ లైన్‌ను స్ర్కిప్ట్‌గా మార్చే పనిలో మునిగితేలుతున్నాడట. అందుకు సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ కూడా ఇప్పటికే పూర్తైందని సమాచారం.
దర్శక ధీరుడు రాజమౌళి ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు డెడ్‌లైన్ విధించారట. అయితే, ఎన్టీఆర్ రామ్‌చరణ్‌లతో రాజమౌళి ఓ చిత్రం తెరకెక్కించేందుకు ఇప్పట్నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్న విషయం అందరికి తెలిసిందే. మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వెల్లువెత్తాయి.
ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అసలు విషయానికొస్తే.. తండ్రి విజయేంద్రప్రసాద్ చెప్పిన స్టోరీ లైన్ రాజమౌళికి తెగ నచ్చడంతో స్ర్కిప్ట్‌కు మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడట రాజమౌళి. అయితే. ఈ స్ర్కిప్ట్ ఇప్పుడు చివరి దశకు వచ్చిందట. అంతేగాక మరో వైపు రామ్‌చరణ్, ఎన్టీఆర్ వారి వారి చిత్రాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. సుకుమార్ దర్శకత్వంతో రామ్‌చరణ్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
తన సినిమాపై వీరిద్దరితో చర్చించిన రాజమౌళి.. 2018 అక్టోబర్ నాటికి తన సినిమాలో జాయిన్ కావాల్సి వస్తుందని, అప్పటిలోగా మీ సినిమాలను పూర్తిచేసుకోండి.. తన సినిమాపై పూర్తి దృష్టిపెట్టాలని, మానసికంగా.. శారీరకంగా ఫిట్‌గా ఉండాలని చెప్పారట. అయితే, మల్లీస్టారర్‌గా తెరకెక్కుతున్న 2019 నుంచి రాజమౌళి తన సినిమాను ప్లాన్ చేశాడట.