మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. 2014 ఎన్నికలలో టీడీపీ తరఫున బాన్స్ వాడ నియోజక వర్గం నుండి పోటీ చేసిన భోజ్యా నాయక్, గాంధారి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తాన్ సింగ్(కాంగ్రెస్ పార్టీ) తో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరురి రమేష్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణరావు పాల్గొన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరురి రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీకి ఆకర్షితులు అవుతున్నారని అన్నారు. ఉద్యమ సమయంలో చాలా సార్లు తెలంగాణ ఏర్పాటు అవుతే మీ బాధలు అన్ని తొలగుతాయని అనేక సార్లు చెప్పారని గుర్తు చేశారు. చెప్పినట్లే ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని ఎమ్మెల్యే అరూరి రమేష్ చెప్పారు. ఏ గడపకుపోయిన పెద్దకొడుకు కేసీఆర్ అని అంటున్నారని ప్రశంసించారు.
భోజ్యనాయక్ మాట్లాడుతూ ఈరోజు పార్టీలో చేరుతున్నాం అంటే కల్యాణ లక్ష్మీ వల్లే అని అన్నారు. ఒక్క గిరిజనుల ఇల్లు కాలిపోతే అందులో ఉన్న డబ్బులు కాలిపోయాయి అని ఏడిస్తే కేసీఆర్ చలించి వెంటనే వాళ్ళను అదుకున్నాడని ఆనాటి సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. అందుకే ప్రభుత్వం ఏర్పడ్డాక కల్యాణ లక్ష్మీ పథకం ప్రారంభించాడు మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.