తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆలోచనకు ప్రాణం పోస్తుంది నంగునూరు .నంగునూరు మండలానికి చెందిన సర్కారు పాఠశాల విద్యార్ధులు రాత్రి అనక పగలు అనక కష్టపడుతున్నారు .దీనికి మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ చూపడంతో పాఠశాలకు చెందిన విద్యార్ధులు ,టీచర్లుకు తోడుగా జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి సహకారంతో గ్రామంలో ఉన్న సర్కారు బడిలో వచ్చే పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నూటికి నూరు శాతం తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు .
అందులో భాగంగా పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు నాగభూషణం ,కత్తుల లక్ష్మారెడ్డి ,పి.సుధాకర్ ,పెంటయ్య ,ముకుందం,జనార్ధన్ ,శ్రీనివాస్ రెడ్డి ,నాగరాజు తదితరులు పదో తరగతి విద్యార్ధులకు స్పెషల్ క్లాస్ లు చెబుతున్నారు .నంగునూరు మండలంలో ఏడు గ్రామాలకు చెందిన డెబ్బై ఏడుమంది విద్యార్ధులు ప్రతిరోజూ ఉదయం ఐదు గంటల నలబై ఐదు నిమిషాలకే స్కూల్ కి చేరుకుంటున్నారు.వీరికి పోయిన ఏడాది అక్టోబర్ నెల నుండే టీచర్లు ప్రత్యేక తరగతులు చెబుతున్నారు .
అంతే కాకుండా ఏకంగా ఈ నెల నుండి ఉదయం ఐదున్నర కే ఉదయం పూట తరగతులు నిర్వహిస్తున్నారు .పదవ తరగతి పరిక్షలు ప్రారంభమై నాటికి డెబ్బై ఏడుమంది విద్యార్ధులకు స్పెషల్ క్లాస్ లు చెప్పడానికి షెడ్యూల్ కూడా వేసుకున్నారు ఉపాధ్యాయులు .ప్రస్తుతం చలి ఎంతగా వణికిస్తున్న కానీ మంత్రి హరీష్ రావు కలలు కన్నా వంద శాతం ఫలితాలు సాధించడానికి విద్యార్ధులు ,టీచర్లు కృషి చేస్తున్నారు .ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు వారిని అభినందిస్తూ వంద శాతం ఫలితాలు సాధించాలని కోరారు .అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఉద్యమపురిటి గడ్డ సిద్ధిపేట మరోసారి తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో చరిత్ర సృష్టించబోతుంది అని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ..