మింట్ కాంపౌండ్ లో 1104 విద్యుత్ కార్మికుల డైరీ ఆవిష్కరణ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ తీరును ఎద్దేవా చేశారు. 24గంటల విద్యుత్ విషయంలో రైతులకు విజ్ణత ఉందని…విజ్ణత లేనిది కాంగ్రెస్ పార్టీకేనని ఆయన వ్యాఖ్యానించారు. అవసరం మేరకే రైతులు విద్యుత్ ను వినియోగించుకుంటున్నారని తెలిపారు. 24గంటల విద్యుత్ వాడకంతో ఈ విషయం స్పష్టం అయిందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఉదయం పూట 9,300 మెఘావాట్ల విద్యుత్ మధ్యాహ్నానికి 8,000 మెగావాట్లకు తగ్గడమే ఇందుకు నిదర్శనమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత నిరంతర విద్యుత్ సరఫరాతొ కొందరిలో ఏడుపు కనపడుతోందని మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. `అసలు కరెంటే ఉండదని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషనే చేసినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకో మాట్లాడలేదు? వారి నాయకులు సోనియమ్మకు కాదు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డికే విద్యుత్ మీద అవగాహన లేదు. వ్యవసాయ రంగానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా ముఖ్యమంత్రి కేసీర్ దార్శనికతకు అద్దం పడుతోంది. అధికారం రావాలనుకున్న ప్రతిపక్షాలు అభివృద్ధిని ఆహ్వానించాలి. కానీ ఎక్కడ లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో విపక్షాలు అభివృద్ధిని అడ్డుకొచూస్తున్నాయి` అని మంత్రి మండిపడ్డారు.