తెలంగాణకు మరో ప్రశంస దక్కింది. ప్రెంచ్ రాయబారితో అలెగ్జాండర్ జీగ్లర్ మన రాష్ర్టాన్ని ప్రశంసించారు. పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామరావుతో సమావేశం సందర్భంగా తెలంగాణ అభివృద్ధిని కొనియాడారు. బంజరాహిల్స్‌లోని నివాసంలో మంత్రి కేటీఆర్‌తో ఫ్రెంచ్ రాయబారి సమావేశం అయ్యరు. తెలంగాణ ప్రభుత్వ పనితీరు గురించి చాల సానూకూల అంశాలు విన్నట్లు మంత్రికి రాయబారి తెలిపారు. ప్రెంచ్-భారత్ ల మద్య శతాబ్దాలుగా సాంసృతిక సంబందాలున్నాయని, ఇప్పటికీ చాల మంది ప్రెంచ్ జాతీయులు నగరంలో ఉన్నారని రాయబారి తెలిపారు. అనేక ప్రెంచ్ కంపెనీలు నగరంలో తమ కార్యకలాపాలు కోనసాగిస్తున్నాయన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు కార్యకలాపాల్లోనూ ప్రెంచ్ కంపెనీ ఒక భాగస్వామిగా ఉందని రాయబారి గుర్తు చేశారు.
ప్రెంచ్ కంపెనీల నుంచి తెలంగాణ ప్రభుత్వ పనితీరు మీద సానుకూలమైన ఫీడ్ బ్యాక్ వచ్చిందని మంత్రికి ఫ్రెంచ్ రాయబారి తెలిపారు. మూడేళ్లలో తెలంగాణ రాష్ర్టం చాలా డైనమీజం చూపించిందని, మూడేళ్లలో రాష్ర్టం సాధించిన ప్రగతికి రాయబారి అలెగ్జాండర్ అభినందనలు తెలిపారు. ప్రెంచ్ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రధాన కారణం ఇక్కడ ఉన్న ఇన్నోవేషన్ అని, ఈ రంగంలో హైదరాబాద్ నగరం ముందు వరుసలో ఉందన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీహబ్ ను అయన పొగడ్తలతో ముంచెత్తారు. తమ దేశంలోని బోర్డో నగరంతో హైదరాబాద్ అనుబంధాన్ని రాయబారి ఈ సమావేశంలో ప్రస్తావించారు. బోర్డో నగరంతో కలసి హైదరాబాద్ నగరంలో మెబిలీటీ అంశంపైన పరస్పర సహాకారం అందించుకునేందుకు, ట్రామ్ రవాణా సౌకర్యం ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. త్వరలోనే 50 ప్రముఖ ప్రెంచ్ పెట్టుబడిదారుల బృందం రానున్నదని తెలిపారు. ఫ్రెంచ్ కంపెనీలకు, పెట్టబడుడిదారులకు అనుసంధాన కర్తగా పని చేసేందుకు ఎప్పుడు సిద్దంగా ఉంటామని మంత్రికి రాయభారీ హమీ ఇచ్చారు.
తెలంగాణలో ఉన్న పెట్టబడుల అవకాశాలను, ప్రభుత్వ విధానాలను రాయబారి అలెగ్జాండర్ కు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున వచ్చిన పారిశ్రామిక విధానం, అనుమతుల ప్రక్రియల ద్వారా ఇప్పటికే తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వచ్చాయన్నారు. తెలంగాణ రాష్ర్టంలో ఉన్న పలు ప్రెంచ్ కంపెనీలు గురించి ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. తెలంగాణకు ఫ్రెంచ్ పెట్టుడులు వచ్చేందుకు సహకరించాలన్న మంత్రి విజ్జప్తికి రాయబారి సానుకూలంగా స్పందించారు. ప్రెంచ్ నుంచి రానున్న పెట్టుబడిదారుల బృందానికి తెలంగాణ ప్రభుత్వ అతిధ్యం ఇస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఏయిరో స్పేస్, ఢిఫెన్స్, ఫార్మా రంగాల్లో ప్రెంచ్ పెట్టుబడులను అశిస్తుందన్నారు. ఈ సమావేశంలో ప్రెంచ్ కాన్సుల్ జనరల్‌తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు.