ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల అరాచకాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నయి .గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ శ్రేణులు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పోరాడుతున్న సంగతి తెల్సిందే .
తాజాగా రాష్ట్రంలో అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలానికి చెందిన కృష్ణాపురం గ్రామ వ్యక్తి సత్యనారాయణ బుధవారం రాత్రి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అసలు విషయానికి వస్తే స్థానిక టీడీపీ పార్టీకి చెందిన నేతల అవినీతి అక్రమాలపై సోషల్ మీడియా వేదికగా ఎండగడుతూ మెసేజ్స్ ,పోస్టింగ్స్ చేస్తున్నాడు అని ఆ పార్టీ నేతలు సత్యనారాయణ మీద పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేస్తూ తమ గురించి అసభ్య పోస్టింగ్స్ చేస్తున్నాడు అని అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు బనాయించారు .
దీంతో భయపడిన సత్యనారాయణ తనను ఎక్కడ అరెస్ట్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాడో అని భయపడి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు .దీంతో అపస్మారక స్థితికి చేరుకున్న సత్యనారాయణను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్ళారు .ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళన కరంగా ఉందని వైద్యులు అంటున్నారు ..