బీజేపికి చెందిన ఓ మహిళా నాయకురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే వెనకడుగు వేస్తోంది. అయితే, గతంలో తనకు కడప జిల్లా రాజకీయాలు పెద్దగా తెలీయకపోయినా.. బీజేపీ నేతల సూచన మేరకు 2004 సాదారణ ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీచేసి ఓటమిని చవిచూసింది బీజేపీ మహిళా నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి.
అయితే, 2004 సాదారణ ఎన్నికల్లో దగ్గుబాటి పురందేశ్వరి విశాఖ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే, అప్పటికే ఏపీ బీజేపీలో సీనియర్ నాయకుడుగా వెలుగొందుతున్న కంభంపాటి హరిబాబుకు.. బీజేపీ పెద్దలు టిక్కెట్ కేటాయించారు. దీంతో చేసేది లేక దగ్గుబాటి పురందేశ్వరి రాజంపేట నుంచి పోటీ చేయాల్సి వచ్చిన మాట విధితం. అంతేగాక, ఈ సారైన విశాఖ నుంచి పోటీ చేసేందుకు దగ్గుబాటి పురందేశ్వరి మళ్లీ బీజేపీ నేతలతో చర్చలు జరుపుతోందట.
ఇదిలా ఉండగా.. దగ్గుబాటి పురందేశ్వరికి సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. బీజేపీ నుంచి రాజ్యసభ సీటును ఆశిస్తోందని, ఎందుకంటే అప్పుడు ఆరేళ్లపాటు ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండొచ్చని గట్టిగానే డిసైడయ్యారట.