ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిను అడ్డుపెట్టుకొని లక్ష కోట్లను వెనకేసినట్లు అప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ,ప్రస్తుత నవ్యాంధ్ర రాష్ట్ర అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ .ఇదే విషయం గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు .ఈ క్రమంలో ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం అయిన హైకోర్టు సంచలన నిర్ణయాన్ని ప్రకటిచింది .తాజాగా ఎమ్మార్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఎల్వీ సుబ్రహ్మణ్యం కు ఊరట లభించింది .
ఈ క్రమంలో ఆయనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేస్తూ ఉన్నత న్యాయస్థానం సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఐఐసీ ఎండీగా ఉన్నప్పుడు ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎమ్మార్ వ్యవహారంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ..ఐపీసీ, అవినీతి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినట్లు సీబీఐ అభియోగాలు పేర్కొంది. ఈ నేపథ్యంలో తనపై సీబీఐ కేసును కొట్టివేయాలంటూ ఎల్వీ సుబ్రహ్మణ్యం హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఎండీగా తన బాధ్యత నిర్వహించానని.. ఎలాంటి నేరం చేయలేదని ఎల్వీ సుబ్రహ్మణ్యం వాదించారు. ఎల్వీ నింబధనలను ఉల్లంఘించి నేరానికి పాల్పడ్డారని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు. క్వాష్ పిటిషన్ పై ఇరువైపుల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఎల్వీ సుబ్రహ్మణ్యంపై కేసును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే క్రమక్రమంగా జగన్ అక్రమాస్తుల కేసులో కేసులు ఒకదాని తర్వాత ఒకటి వీగిపోతుండటంతో జగన్ అభిమానులు ,వైసీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ….