గజల్ శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. యువతిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన గజల్ శ్రీనివాస్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో కొద్దిసేపటి క్రితమే వాదనలు ముగిశాయి. శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయమూర్తి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. అనంతరం ఆ పిటిషన్‌ను కొట్టివేశారు. యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఈ నెల 2న పక్కా ఆధారాలతో శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్టుచేసి చంచల్‌గూడ న్యాయస్థానానికి తరలించిన విషయం తెలిసిందే.సమాజంలో పేరున్న వ్యక్తి గనక బెయిల్ మంజూరుచేస్తే సాక్ష్యాలను తారుమారుచేసే అవకాశం ఉన్నందున శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసుల తరఫు న్యాయవాది నిన్ననే న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.