ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్‌ను మంగళవారం పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. తనను లైంగికంగా వేధించాడంటూ కుమారి అనే రేడియో జాకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి గజల్ గాయకుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గజల్ శ్రీనివాస్‌కు ఈ నెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో, శ్రీనివాస్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఆధ్యాత్మిక ముసుగులో ప్రముఖుల మన్ననలు, ప్రశంసలు అందుకుంటూ సెలబ్రిటీ జీవితం అనుభవిస్తున్న గజల్ శ్రీనివాస్ మహిళల పట్ల చేసిన ఆరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తమపట్ల గజల్ శ్రీనివాస్ చేసిన అరాచకాలను చెప్పేందుకు బాధితులు ఒక్కొరిగా మీడియా ముందుకు వస్తున్నారు.
అయితే, వారు చెప్పిన విషయాలు ఆశ్చర్యాన్ని గొల్పుతున్నాయి. గజల్ శ్రీనివాస్ గురించి వారు చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి.. అనేక మంది ఆడవారినీ గజల్ శ్రీనివాస్ సెక్స్ కు బానిసలుగా మార్చుకున్నాడని, అందుకు కేంద్రం సేవ్ టెంపుల్స్ పేరుతో తాను నిర్వహిస్తున్న ఆలయ వాణి రేడియో కార్యాలయమే అని మీడియాకు చెప్పారు బాధిత మహిళలు.
ఆ విషయం అటు ఉంచితే.. నిన్న రాత్రి జైలులో గజల్ శ్రీనివాస్‌కు అస్సలు నిద్ర పట్టలేదట. అంతేగాక చాలా నీరసంతోనూ కనిపించాడని పోలీసుల సమాచారం. ఎప్పుడూ ప్రముఖులు, సన్మానాలతో బిజీ బిజీగా గడిపే తాను ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఒక్కసారిగా ఇలా జైలుకు వెళ్లడంతో చాలా బాధతో మనస్సులో మదన పడుతూ.. తన జైలు జీవితాన్ని గడిపాడట గజల్ శ్రీనివాస్.