Home / TELANGANA / ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు స్వల్ప ఊరట

ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు స్వల్ప ఊరట

పౌర‌స‌త్వం విష‌యంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు స్వల్ప ఊరట లభించింది. చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వాన్ని గతేడాది డిసెంబర్ నెలలో కేంద్రం రద్దు చేసిన విషయం విదితమే.  పౌరసత్వం రద్దుపై కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను 6 వారాల పాటు హైకోర్టు నిలిపివేసింది. ఈ అంశంపై మళ్లీ వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది.

పౌరసత్వం రద్దుపై గత ఆగస్టు 31న హోంశాఖ తీర్పునిచ్చినా డిసెంబర్ నెలలో రమేశ్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దానిని హోంశాఖ నాడు కొట్టి వేసింది. సంవత్సరం పాటు వరుసగా దేశంలో ఉండాలనే నిబంధనను రమేశ్ పాటించలేదని తమ విచారణలో తేలిందని, అందుకని ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నామని హోంశాఖ వివరించింది. అయితే కేంద్ర హోంశాఖ ఇచ్చిన తీర్పు లోపభూయిష్టంగా, ఏకపక్షంగా ఉన్నదని రమేశ్ నాడు వ్యాఖ్యానించారు.

హోంశాఖ తీర్పుపై హైకోర్టుకు వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. హోంశాఖ నియమించిన విచారణ కమిటీ గతంలో ఇచ్చిన నివేదిక ఆధారంగానే కేంద్రం తుది నిర్ణయం తీసుకున్నదని, అసలు ఆ నివేదిక తప్పుల తడక అని న్యాయ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారని రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. పౌరసత్వ చట్టంలో ఉన్న విషయాలను సమగ్రంగా చూడాలే కానీ సాంకేతికంగా చూడటం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఏడాదిపాటు దేశంలో ఉండాలనే నిబంధన 2009 ఫిబ్రవరి 25 నుంచి అమల్లోకి వచ్చిందని, కానీ తనకు 2009 ఫిబ్రవరి 3నే పౌరసత్వం లభించిందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి తనకు పౌరసత్వం ఇచ్చిన తరువాత విధించిన నిబంధన తనకు వర్తించదన్నారు. రివ్యూపిటిషన్‌లో తాను సమగ్ర సమాచారం ఇచ్చినా కేంద్రం మరోసారి పొరపాటు అవగాహనకు వచ్చిందని, న్యాయం కోసం తాను మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తానని రమేశ్ గతేడాది డిసెంబర్ నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat