ఏపీలో ప్రజలు టీడీపీ నై తీవ్రంగా మండి పడుతున్నారు. తన లబ్ది కోసం పవిత్రమైన దేవస్థానల్లో క్షుద్రపూజలు చేయించడం దారుణం అని ఖండిస్తున్నారు. అంతేగాక ప్రతి పక్షం నాయకులు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. మరోపక్క చిత్తూరు జిల్లాలో పుట్టి ఈ జిల్లాకు ఒక్క పరిశ్రమ తేలేని దద్దమ్మ చంద్రబాబు అని వైసీపీ ఎమ్మెల్యేఆర్కె రోజా ధ్వజమెత్తారు. సొంత జిల్లాను పట్టించుకోని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రశ్నించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో విజయం వైసీపీదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మోసపూరిత పాలన జరుగుతోందని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని, ప్రత్యేక హోదా తీసుకురాలేక కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో తప్పించుకునేందుకు ఏపీని బాబు తాకట్టు పెట్టాడన్నారు. రాష్ట్రంలో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలీని పప్పుకి మంత్రి పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు.
సోది సోమిరెడ్డి, కలెక్షన్ కింగ్ నారాయణలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.. దొడ్డిదారిలో మంత్రులైన వీరు పార్టీకి పెట్టిన పెట్టుబడులను ప్రజల నుంచి తిరిగి దోచుకుంటున్నారని ఆరోపించారు. నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు దారుణమని, వీరిపై కేసులు నమోదు చేయకుండా పోలీసులు అమ్ముడుపోతున్నారని అన్నారు. క్షుద్రపూజలు చేసి మళ్ళీ గెలవాలని చూస్తే ప్రజలు ఒప్పుకోరని చంద్రబాబును రోజా హెచ్చరించారు