ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటితో యాబై నాలుగురోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖ అయిన చిత్తూరు జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు .
ఈ క్రమంలో గురువారం జిల్లాలో పెద్దూరు లో పాదయాత్ర చేస్తున్న జగన్ ను కుప్పం నియోజకవర్గానికి చెందిన ప్రజలు ,రైతూ ,యువత పెద్ద ఎత్తున కలిశారు .ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత గ్రామం నారావారిపల్లి చంద్రగిరి నియోజకవర్గంలో ఉంటె అక్కడ గెలవడం చేతకాక కుప్పం నియోజక వర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నారని ..ఇక్కడ ఉన్నవారు మంచి వాళ్ళు కాబట్టి తనను గెలిపిస్తారు అని ఇక్కడ నుండి పోటి చేస్తున్నారు .
ఈసారి చంద్రబాబుకు మీరంతా కల్సి బుద్ధి చెప్పాలి .కుప్పం నియోజకవర్గం నుండి వైసీపీ తరపున పోటీచేసే అభ్యర్ధిగా కుప్పం వైసీపీ పార్టీ సమన్వయ కర్త అయిన చంద్రమౌళిని నిలబెడుతున్నాను .మీరంతా చంద్రమౌళి అన్నను బంపర్ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే క్యాబినెట్ లో మంత్రి పదవిచ్చి నాపక్కన కూర్చోబెట్టుకొని మీకు న్యాయం జరిగేవిధంగా చూస్తాను అని ఆయన అన్నారు .అయితే ఆగస్టు నెలలో జరిగే బస్ యాత్రలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని ప్రతి మండలానికి వస్తాను అని తనను కలవడానికి వచ్చిన కుప్పం నియోజక వర్గ ప్రజలకు జగన్ హామీ ఇచ్చారు ..