నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రముఖ యాంకర్ ప్రదీప్ పట్టుబడిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ప్రదీప్ పై షోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే .. ఈ నేపధ్యంలో తాజాగా ప్రదీప్ తన పేస్ బుక్ ఖాతా లో ఒక వీడియో ను పోస్ట్ చేశాడు .
“నాపై అనేక అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయి.వాటిని ఎవరూ నమ్మవద్దు. ముందస్తుగా అంగీకరించిన కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్నా. పోలీసుల సూచనల మేరకు కౌన్సిలింగ్‌కు హాజరవుతా. డిసెంబర్ 31 నాటి ఘటన విచారకరం. నేను డ్రంక్ అండ్ డ్రైవ్ నిబంధనలు ఉల్లంఘించిన మాట వాస్తవమే. తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నా. నేను చేసిన తప్పు మరెవరూ చేయకూడదు” అని ఒక వీడియో పోస్ట్ చేశాడు