అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీ రాబోతుంది.ఇప్పటికే పొలిటికల్ ,క్రీడాకారుల జీవిత చరిత్రల ఆధారంగా వచ్చిన సినిమాలన్నీ హిట్ అవుతున్న సందర్భంలో దర్శకులు ,నిర్మాతలు బయోపిక్ తీయడానికి ముందుకు వస్తున్నారు.
ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త మాత్రం ఫిల్మ్ నగర్ లో తెగ చక్కర్లు కొడుతుంది. మొన్నటి వరకూ ఈ పాత్రను చేయడానికి మలయాళ స్టార్ హీరో మమ్ముట్టీని సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఏమీ లేదు కానీ.. ఇప్పుడు వైఎస్ పాత్రను చేయడానికి యువసామ్రాట్ నాగార్జునను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారట. అందులో భాగంగా మమ్ముట్టీతో పాటు, నాగార్జునను కూడా పరిగణనలోకి తీసుకున్నారట. అంతిమంగా ఎవరు ఆ పాత్రలో కనిపించబోతారనేది ఆసక్తిదాయకమైన అంశం. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను కలవబోతున్నాడట మహీ వీ రాఘవ్. బయోపిక్స్ సీజన్ నడుస్తున్న ప్రస్తుత తరుణంలో.. స్టార్ వ్యాల్యూతో వైఎస్ బయోపిక్ వస్తే.. అది ఆసక్తిదాయకంగా నిలిచే అవకాశం ఉంది.త్వరలోఈ మూవికి సంబంధించిన వివరాలు ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు .