దేశంలో అక్రమ సంబంధాలు చాల దారుణంగా పెరిగిపోతున్నాయి. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎంతో మంది పిల్లు ఆనాదలుగా మారుతున్నారు. అయితే సాధారణంగా పెళ్లైన తరువాత భార్యలు ఉండగానే భర్తలు రెండో వివాహం చేసుకోవడం చూస్తున్నాం. కానీ, ఆ భర్త మాత్రం తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడిని పెళ్లాడేందుకు సమ్మతించాడు. బీహార్లోని వజీర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వింత వైనం చోటుచేసుకుంది.
వివరాలను చూస్తే బీహార్ రాష్ట్రంలోని కరదాకు చెందిన గఫ్తర్ అలీకి తొమ్మిదేళ్ల క్రితం డల్లాపూర్కు చెందిన ఓ యువతితో పెళ్లైయ్యింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టారు. ఈ క్రమంలో ఉపాధి కోసం గఫ్తర్ అలీ విదేశాలకు వెళ్లాడు. దీంతో తన ఇద్దరు పిల్లలతో ఆ మహిళ ఇంటి దగ్గరే ఉంటుంది. ఈ క్రమంలో గ్రామంలోని ఒక యువకునితో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో వారు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని భర్తకు ఫోను ద్వారా తెలిపింది. దీంతో ఆయన తన భార్య మరో వివాహానికి మొబైల్ ఫోనులోనే అనుమతిచ్చాడు. దీంతో ఆ మహిళ తన ప్రియుడిని పెళ్లి చేసుకోగా, తన ఇద్దరు పిల్లలను మొదటి భర్తకు అప్పగించింది.