Home / SLIDER / ఫ‌లించిన టీఆర్ఎస్ పోరాటం…

ఫ‌లించిన టీఆర్ఎస్ పోరాటం…

హైకోర్టు విభజన కోసం టీఆర్ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న పోరాటం ఫలించింది. కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కు హైకోర్టు విభ‌నజ‌కు ఓకే చెప్పి…. భవనాలు పరిశీలించాలంటూ ఉమ్మడి హైకోర్టుకు ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖతో మరో అడుగు ముందుకుపడింది. చంద్రబాబు లేఖతో రంగంలోకి దిగిన అధికారులు తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు కావాల్సిన భవనాల వేటలో పడ్డారు. ఈ మేరకు హైకోర్టు కన్ఫరెన్స్‌ హాల్‌లో ఫుల్ కోర్టు సమావేశం జరిగింది. భవనాల పరిశీలనతో పాటు ఉద్యోగాల విభజన అంశాలు కీలకంగా మారాయి. దీనిపై హైకోర్టు న్యాయమూర్తులతో కమిటీని వేశారు. భవనాల పరిశీలన, ఉద్యోగుల విభజనపై నిర్ణయాలు తీసుకున్న తర్వాత మరో సారి ఫుల్‌ కోర్ట్ సమావేశం జరగనుంది.ఫుల్ కోర్టు సమావేశం హైకోర్టు సమావేశ మందిరంలో జరిగింది. ముందుగా తాత్కాలిక భవనాలను పరిశీలించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారని అందుకోసం న్యాయమూర్తులతో సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించారని తెలిసింది. దానితో పాటు ఉద్యోగుల విభజనపై కూడా మరో సబ్‌ కమిటీని ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.

ఈ కమిటీల ఎంపిక బాధ్యతను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌కు ఫుల్‌కోర్టు సమావేశం అప్పగించింది. భవనాలను పరిశీలించిన తర్వాత మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.ఫుల్ కోర్ట్‌ సమావేశంలో ఏపీ హైకోర్టు ఏర్పాటుపై ఆసక్తికర చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తాత్కాలిక భవనాల్లో ఏపీ హైకోర్టు ఏర్పాటుపై ఏపీ ప్రాంతానికి చెందిన కొందరు న్యాయమూర్తులు
అభ్యంతరాలు వ్యక్తంచేశారు. మౌలిక సదుపాయాలు, వసతులపై సందేహాలు లేవనెత్తుతూ ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. తమ వాదనలకు మద్దతుగా.. హైకోర్ట్ విభజనపై 2015లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా ధర్మాసనం జారీచేసిన ఉత్తర్వులను ప్రస్తావించారని తెలుస్తోంది.మరోవైపు… శాశ్వత భవనం నిర్మించిన తర్వాతే హైకోర్టును తరలిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయని చెప్తున్నారు.తాత్కాలిక భవనంలోకి హైకోర్టును తరలిస్తే.. తమకు అమరావతిలో వసతి సౌకర్యాల మాటేమిటంటూ పలువురు న్యాయమూర్తులు ప్రశ్నిస్తున్నారు.

భవనాల విషయమై న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తడంతో.. ఏసీజే ఓటింగ్‌ను నిర్వహించారని తెలిసింది. ఈ ఓటింగ్‌లో మెజార్టీ న్యాయమూర్తులు.. ఏపీ సర్కార్ ఎంపిక చేసిన భవనాలను పరిశీలించడానికి అంగీకరించారని తెలుస్తోంది. పరిశీలన నిమిత్తం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సబ్‌కమిటీని ఏర్పాటుచేయాలని,.. నిర్ణయించారు. దానితో పాటు హైకోర్టు ఉద్యోగుల విభజనకోసం సబ్‌కమిటీని తక్షణం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైకోర్టు రికార్డుల డిజిటలైజేషన్‌ కోసం మరో కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఫుల్‌కోర్టు
నిర్ణయం తీసుకుందని సమాచారం. సబ్ కమిటీలను ఏర్పాటుచేసే బాధ్యతను ఏసీజేకు ఫుల్‌కోర్టు అప్పగించినట్టు తెలిసింది.అమరావతిలో జస్టిస్ సిటీ ఇంకా పూర్తి కాలేదు. ఏపీ హైకోర్టును తాత్కాలిక భవనాల్లో కొనసాగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని సమావేశంలో కొంతమంది న్యాయమూర్తులు ప్రస్తావించారని చెప్తున్నారు.

జూన్‌నాటికి హైకోర్టు నిర్వహణకు కావాల్సిన సౌకర్యాలు పూర్తిస్థాయిలో ఏర్పాటుచేయడం సాధ్యంకాదనే అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు సమాచారం. హడావిడిగా హైకోర్టును ఏర్పాటుచేస్తే నిర్వహణ సమయంలో ఇబ్బందులు తలెత్తే ఆవకాశముందని పేర్కొన్నారని తెలిసింది. మరో రెండేండ్లలో శాశ్వత భవనాలు పూర్తయ్యే ఆవకాశముందని ఏపీ సర్కార్ చెప్తున్న విషయాన్ని కొంతమంది న్యాయమూర్తులు ప్రస్తావించారని తెలిసింది. తమకు నివాస సముదాయాలు, సిబ్బందికి క్వార్టర్లు తప్పకుండా ఏర్పాటుచేయాల్సిన అవసరముందని పేర్కొన్నారని సమాచారం. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని న్యాయమూర్తులు అన్నట్టు తెలుస్తున్నది. దీనితోపాటు ఉద్యోగులకు భత్యాలను పెంచే విషయాన్ని ప్రభుత్వానికి కచ్చితంగా చెప్పాలని మరికొందరు అభిప్రాయపడ్డట్టు తెలిసింది.ఈ సమావేశంలో భాగంగా హైకోర్టు విభజనలో న్యాయవాదులను భాగస్వాములనుచేసే అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది.

న్యాయవాదులను భాగస్వాములనుచేస్తే మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని, అయితే న్యాయవాదుల ప్రాక్టీస్‌కు ఇబ్బందులు లేకుండా.. చాంబర్లువంటి విషయాలపై వారి అభిప్రాయాలు తీసుకుంటే బాగుంటుందని న్యాయమూర్తులు సూచించినట్టు సమాచారం. ఉద్యోగుల విభజనపై సబ్ కమిటీని ఏర్పాటుచేసి, విధివిధాలను సైతం రూపొందించాలని నిర్ణయించారని తెలిసింది. తీవ్ర వాదోపవాదాల అనంతరం తాత్కాలిక భవనాల పరిశీలనకోసం కమిటీని ఏర్పాటుచేసే బాధ్యతను ఏసీజేకు అప్పచెప్పారని సమాచారం. త్వరలోనే సబ్‌కమిటీని ఏర్పాటు చేసే ఆవకాశముందని విశ్వసనీయవర్గాలు పేర్కొంటున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat