తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి హరీష్ రావుతో పాటుగా బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ &టీఎన్జీవో గౌరవ అధ్యక్షులు దేవి ప్రసాద్, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి ,టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ,సీఎం ఒఎస్డీ దేశపతి శ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం నాటి సందర్భాన్ని పలువురు నెమరువేసుకున్నారు. మండలి చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జీవితం కోసం..జీతం కోసం తెలంగాణ అనే ఒక్క నినాదంతో ముందుకు సాగామని గుర్తుకుచేసుకున్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం సర్కారు ఎన్నో నిర్నయాలు తీసుకుందని…మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు.
సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ `క్యాలెండర్ అంటేనే కాలమానం ….ఇది శిశిర ఋతువు ,వచ్చేది వసంత ఋతువు. ఒక్కొక్క ఋతువు ఒక్కో ఒక్క ప్రత్యేకత ఉంటుంది. ఇది గొప్ప సంఘం. సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తోంది. నిజమే కానీ పక్కన ఉన్న రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులను తెచ్చుకోవడం మనపైన ఉన్నది. కేంద్ర ప్రభుత్వం, పక్కన ఉన్న ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెడితుందో మీకు అందరికి తెలుసు. సమస్యలకు సంబంధించి మీరు ఉద్యమించి మీ సమస్యలను పరిష్కరించుకుంటారు అని కొత్త సంవత్సరం లో ప్రభుత్వం కూడా మీ సమస్యలను పరిష్కరిస్తారు అని చెప్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.` అని తెలిపారు.
సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ “తెలంగాణ ఉద్యమ అవసరానికి ఉద్యమాన్ని ముందు ఉండి నడిపించిందే మీరు. తెలంగాణ ఉద్యమాన్ని ఉదృతం చేసి నిప్పును రాజేసిందే మీరు. తెలంగాణ ఎట్లా సాదించాలో మీకు తెలిసినట్టు ఎవ్వరికి తెల్వదు.
ఉద్యమాన్ని ఎం ఆశించకుండా ….రోడ్ల మీద …మూళ్ళ కంచెల మీద రాష్ట్రాన్ని సాధించిన మీకు దండాలు. తెలంగాణ సాధించాం కాని దాన్ని ఎలా నడిపించాలో కూడా మనం తెలుసుకోవాలి. తెలంగాణ వస్తే ఎం వస్తది అంటే ఇప్పుడే రైతుల కన్నీళ్లు తుడిచేందుకు 24 గంటల కరెంట్ ను ఇచ్చి అధిగమించాం. ఉద్యమ సమయంలో మైక్ లలో మాట్లాడుతూ ఎన్నో సార్లు మైక్ కట్ అయిన సందర్భాలు మనం చూశాం. దుబ్బాకలో కరెంట్ పెట్టడానికి పోతే నక్షలైట్ లు అని కాల్చిచంపిన సంఘటనలు మనం ఎన్నో చూశాం. ఇప్పుడు అవి అన్ని అధిగమించి ముందుకు పోతున్నాం.
ఒక్క అట్టడుగు స్థాయి నుండి వచ్చి శాసన మండలి చైర్మన్ అయిండు ఇది తెలంగాణ సంస్కృతి.` అని అన్నారు.
బేవరేజెస్ చైర్మన్ దేవి ప్రసాద్ మాట్లాడుతూ `ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలు ఇప్పటికే పరిష్కరించబడినది.అయితే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్ళామన్నారు. గతంలో మేము విజయవాడ వెళ్ళినప్పుడు అశోక్ బాబు ను కల్సి ఈ సమస్య పై చంద్రబాబు తో మాట్లాడాలి అని చెప్పాం. దీనిపై అనేక సార్లు దత్తాత్రేయ తో మాట్లాడడం జరిగింది కానీ కేంద్రం నుండి ఇప్పటి వరకు ప్రకటన రాలేదు. ఇప్పటికైన కేంద్రప్రభుత్వం మొండి వైఖరి వీడాలి` అని అన్నారు.