పెళ్లిదాక ఆగలేని ఓ టీచర్‌కు ఓ ప్రిన్సిపాల్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. తనకు ఇలాంటి గిఫ్ట్ వస్తుందని ఆ టీచర్‌గాని, అలాంటి గిఫ్ట్ తన చేతులమీదుగా పంపాల్సి వస్తుందని ఆ ప్రిన్సిపాల్‌గాని ఊహించలేదు. అయితే, ప్రిన్సిపాల్ పంపించిన ఆ గిఫ్ట్‌కు ఆశ్చర్యపోవడం టీచర్ వంతైంది.
అసలు విషయానికొస్తే.. కాశ్మీర్ రాష్ట్రంలోని పులూమావా జిల్లా పరిధిలోగల ట్రాల్ టౌన్‌లో ఓ ముస్లిం ఎడ్యుకేషన్ స్కూల్ ఉంది. అందులో తారిక్ బట్, సుమయా బషీర్ టీచర్లుగా పనిచేస్తున్నారు. అయితే, వీరు గర్ల్స్, జంట్స్ క్యాంపస్‌లో విడి విడిగా విధులు నిర్వహిస్తున్నారు. అంతేగాక వీరిద్దరూ టీచర్లు కావడంతో ఒకరినొకరు ఇష్టపడి.. పెద్దల సమక్షంలో ఒక్కటయ్యేందుకు నిర్ణయించుకున్నారట. అనుకున్నదే తడవుగా వారి విషయాన్ని పెద్దలకు తెలపడంతో.. వారు కూడా తారక్‌బట్‌కు, సుమయా బషీర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి నిశ్చితార్ధం కూడా జరిపారట.
కానీ, వివాహం కోసం మాత్రం కొన్ని రోజులు వేచి చూడాల్సిందేనని కుటుంబ సభ్యులు ఒక్కటి కాబోతున్న వారిద్దరికి చెప్పారట.
అయితే, నిశ్చితార్థం అయింది కదా..! అనే కాన్సెప్ట్‌తో వారిద్దరూ అందరి ముందు ఫ్లయింగ్ కిస్సులు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు సంభాషించేవారట.
ఈ నేపథ్యంలో గత నెల 30వ తేదీన వీరి వివాహం ఉన్నందున వారి విధులకు సెలవులు పెట్టారు తారక్ బట్, సుమయా బషీర్. అయితే, పెళ్లిపీటల మీద ఉన్న వీరిద్దరికి ఓ అనుకోని గిఫ్ట్ వచ్చిందట. తారా.. ఆ గిఫ్ట్‌లోని లెటర్‌ను చదివి నవ దంపతులు ఇద్దరూ షాక్‌కు గురయ్యారు. ఇంతకీ ఆ లెటర్‌లో ఉన్నది ఏంటనేగా మీ డౌట్. మీకు రావాల్సిన పారితోషకం రూ.116లని మీకు అందించాం.. ఇకపై మీరు స్కూల్‌కు రావాల్సిన అవసరం లేదు. మీరు ఇక శాశ్వతంగా సెలవు తీసుకోవచ్చు అని ఆ స్కూల్ యాజమాన్యం ఆ లెటర్ పంపింది.
దీనిపై ఆ నవదంపతులు ఇద్దరూ స్కూల్ యాజమాన్యాన్ని వివరణ కోరగా.. టీచర్ల జంటకు దిమ్మతిరిగే వాస్తవాలను చూపెట్టిందట స్కూల్ యాజమాన్యం. స్కూల్ లైబ్రరీలో, ఎవరూ లేని సమయంలో తరగతి గదిలో, ల్యాబ్‌లో ఆ నవ దంపతులు గతంలో చేసిన దృశ్యాలను, క్లప్పింగ్స్‌ను వారికి చూపెట్టిందట స్కూల్ యాజమాన్యం. ఇక ఆ నవ దంపతులు చేసేదిలేక తలదించుకు వెళ్లారట. ఇదండీ సంగతి.. బాధ్యతాయుత వృత్తిలో ఉండికూడా.. ఇలా చేయడంతో ఆగ్రహించిన స్కూల్ యాజమాన్యం వారిని విధుల నుంచి తొలగించడం సబబేనంటున్నారు అందరూ.