ఆ మహానేత పేరు వింటే చాలు.. ఆ ముఖ్యమంత్రి షేక్ అవుతున్నారు. ఆ మహానేత మరణించి ఇప్పటికి ఎనిమిదేళ్లు అవుతోంది. ఆ పేరు చెప్పగానే సీట్లో కూర్చున్న వ్యక్తి టక్కున పైకి లేచి.. ఆ పేరు చెప్పకుండా అడ్డుకున్నారు. ఈ సంఘటన కడప జిల్లా పులివెందులలో చోటు చేసుకుంది.
కాగా, ఇటీవల ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టామంటూ చెప్పుకుంటున్న భూమి – మన ఊరు కార్యక్రమాన్ని బుధవారం కడప జిల్లా పులివెందులలో నిర్వహించిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గండికోట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన విషయం విధితమే. పులివెందులలో నిర్వహించిన కార్యక్రమానికి వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పీచ్ అనంతరం ఎంపీ వినాష్‌రెడ్డి మైక్ అందుకుని మాట్లాడుతూ.. గండికోట ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో శంకుస్థాపన జరిగిందని, అంతేగాక గండికోట ఎత్తిపోతల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూ.1500 కోట్లు కేటాయించారని చెప్పారు. దీంతో చంద్రబాబుకు ఒక్కసారిగా ఆగ్రహం వచ్చింది.
అయితే, టీడీపీ కార్యకర్తలు, నేతలు, నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినాష్‌రెడ్డి మాత్రం తాను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పారు. అనంతరం స్పందించిన చంద్రబాబు ఏవైనా సమస్యలు ఉంటే తనకు లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పారు. ఒక పార్లమెంట్ సభ్యుడు సభలో మాట్లాడుతుంటే.. ఇలా టీడీపీ వర్గమంతా ఎంపీపై చేతులువేసి.. నానా రచ్చ చేస్తుంటే మాత్రం చంద్రబాబు చూస్తూ ఉండటమేంటని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.