విజయవాడ దుర్గమ్మ సన్నిధానం లో డిసెంబర్ 26 న క్షుద్రపూజలు జరిగాయని బయట పడడం తో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యవహారం ఫై అందరూ మండి పడుతున్నారు. తాంత్రిక పూజలు జరిగినట్టు ఆరోపణలు రావడంలో ఆలయ ఈవో సూర్యకుమారిని ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే ఆలయ శుద్ది అంటూ ప్రభుత్వం చెప్పిన కాకమ్మ కథలు అవాస్తవమని తేలిపోయింది. ఆలయంలో తాంత్రిక పూజలు జరిగిన మాట వాస్తవమేనని ఆలయ పాలకమండలి కూడా ప్రకటించింది. వేల ఏళ్ల క్రితం అమ్మవారికి ఆదిశంకరాచార్యులు చేసిన కళాన్యాసం తొలగించి క్షుద్రపూజలు నిర్వహించారు. ఆలయంలోకి క్షుద్రశక్తులను ఆహ్వానించారు. కళాన్యాసం తొలగించిన సమయంలో స్వర్ణరేఖలు కూడా దెబ్బతిన్నాయట.
గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివేరుకు చెందిన అర్చకుడు సృజన్. అక్కడ శివాలయంలో పనిచేస్తున్నాడు. ఇంద్రకీలాద్రిపై డిసెంబరు 26న అర్ధరాత్రి తాంత్రిక పూజలు చేసిన సమయంలో అతడు అక్కడే ఉన్నాడు. స్మార్త వైదిక ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అమ్మవారి కవచాన్ని తొలగించి, మహిషాసురమర్థినిగా అలం కరణ చేసింది సృజనే. విజయవాడ పోలీసుల అదుపులో ఉన్న సృజన్ తాము తాంత్రిక పూజలు చేసింది నిజమేనని అంగీకరించాడు. ఆరోజు అమ్మవారిని కాళికామాతగా అలంకరించి పూజలు చేసినట్టు వెల్లడించారు. నారా లోకేష్‌కు శక్తులు వచ్చేందుకు ఈ క్షుద్రపూజలు చేసినట్టు సృజన్ తన బంధువులు, సన్నిహితులతో చెప్పినట్టు ప్రముఖ పత్రికల్లో కథనాలు వచ్చాయి. ‘‘సీఎం చంద్రబాబు , రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌కు రాజయోగం దక్కడం కోసం కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు చేశాం అని సృజన్ కొన్ని రోజులుగా మాతో చెబుతున్నాడు. మేము పట్టించుకోలేదు. కానీ, ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో తాంత్రిక పూజలు చేశారని వెలుగులోకి రావడంతో అది నిజమేనని అర్థమైంది’’ అని సృజన్ సన్నిహితులు, బంధువులు ప్రస్తుతం మీడియాతో చెప్పారు.