అవును మీరు చదివింది నిజమే.. ఎన్టీఆర్ ఓ మంచి పని చేశాడట. అయితే, ఎన్టీఆర్ చేసిన ఈ మంచి పనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తోపాటు.. మరో హీరో ఫ్యాన్స్ కూడా ఫుల్ కుషీలో ఉన్నారు. దీంతో తెలుగు సినీ ఇండస్ర్టీ కూడా ఫుల్ హ్యాప్పీలో ఉంది. ఇంతకీ అందరూ అలా హ్యాప్పీలా ఉండేలా ఎన్టీఆర్ ఏం చేశాడనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నా..
అసలు విషయానికొస్తే.. వక్కంత వంశీ డైరెక్టర్‌గా.. స్టైలష్ స్టార్ హీరోగా తెరకెక్కుతున్న నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా చిత్రం ఫస్ట్ ఇంపాక్ట్ పేరుతో విడుదల చేసిన టీజర్ అందర్నీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, వక్కంత వంశీ ఈ చిత్రంలో హీరోగా ఎన్టీఆర్‌ను అనుకోగా.. కథ విన్న ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమాలో నటించేందుకు నో చెప్పాడట. దీంతో డిసప్పాయింట్ అయిన వక్కంత వంశీ.. వెంటనే ఈ కథను బన్నీకి వినిపించగా.. మరో ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పేశాడట బన్నీ. కాగా, ఎన్టీఆర్ ఈ కథకు నో చెప్పాడానికి కారణం.. హీరో క్యారెక్టరైజేషనేనట. కాగా, వక్కంత వంశీ కథ అందించిన టెంపర్ చిత్రంలోను అలాగే, సాంబ, దమ్ము తదితర చిత్రాల్లో లాగానే హీరో క్యారెక్టరైజేషన్ ఉండటంతో ఎన్టీఆర్ వంక్క వంశీ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు సమాచారం.
అయితే, ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ ఫస్ట్ ఇంపాక్ట్ మాత్రం చూపరులను తెగ ఆకట్టుకోవడంతోపాటు.. సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. దీంతో వంక్కత వంశీతోపాటు.. బన్నీ ఫ్యాన్స్.. అంతేగాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఫుల్ కుషీలో ఉన్నారు. ఎన్టీఆర్ వక్కంత వంశీ సినిమాను రిజెక్ట్ చేసి మంచి పని చేశాడని, ఒకవేళ ఆ చిత్రం చేసి ఉంటే.. రొటీన్‌గా ఉండి.. ఎన్టీఆర్‌కు కాస్త మైనస్ అయి ఉండేదని.. ఆ చిత్రం నుంచి తప్పుకుని మంచి పనిచేశాడని చర్చించుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.