సిని క్రిటిక్, బిగ్‌బాస్ (తెలుగు) షో పాటిస్పెంట్ కత్తి మహేష్ అంటే ప్రస్తుతం తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్‌కు. అంతలా సోషల్ మీడియా వేదికగా పాపులర్ అయ్యాడు మహేష్ కత్తి. కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలతో కత్తి మహేష్ కు పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా కోటి రూపాయల వరకు నగదు సమకూరినట్లు సమాచారం.
అయితే, ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కత్తి మహేష్.. ఈ సారి మాత్రం రూటు మార్చాడు. తన కత్తిని త్రివిక్రమ్‌పై దూశాడు. త్రివిక్రమ్‌ను విమర్శిస్తూ తన ఫేస్‌బుక్ వేదికగా విమర్శలు గుప్పించాడు. త్రివిక్రమ్ కాపీ చేయకుండా రాసిన కథ ఒక్కటి కూడా లేదని, త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం అజ్ఞాతవాసి కూడా కాపీయేనని పోస్ట్ పెట్టాడు. ముఖ్యంగా యండమూరి వీరేంద్రనాథ్ రాసిన పుస్తకాలను బట్టీపట్టి మరీ.. పుస్తకంలోని డైలాగ్‌లను, స్టోరీలను స్ర్కిప్ట్‌గా తీసుకుని సినిమాలు తీయడం ఒక గొప్ప దర్శకుడి తత్వం కాదని, అసలు త్రివిక్రమ్ గొప్ప దర్శకుడు కాదంటూ విమర్శలు గుప్పించారు.