గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను తమ కస్టడీకి ఇవ్వాలన్న పంజాగుట్ట పోలీసుల పిటిషన్‌ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. ఆయన బెయిల్ పిటిషన్ పైన శుక్రవారం విచారణ జరపనుంది. ఆలయవాణి రేడియోలో పనిచేస్తోన్న ఓ యువతిని వేధించిన కేసులో గజల్ శ్రీనివాస్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో చంచల్ గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నాలుగు రోజుల పాటు గజల్ శ్రీనివాస్‌ని విచారిస్తామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు పురోగతి కోసం తమ కస్టడీలోకి తీసుకుంటామన్నారు. అయితే గురువారం ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇప్పటికే అన్ని వీడియోలు, ఆధారాలు ఇచ్చామని చెప్పారని, అలాంటప్పుడు కస్టడీ అవసరం లేదని గజల్ శ్రీనివాస్ తరఫు న్యాయవాది చెప్పారు.గజల్ శ్రీనివాస్ రాసలీలలకు సంబంధించి మరిన్ని వీడియోలను బాధితురాలు తాజాగా విడుదల చేశారు. పార్వతి తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అని నిరూపించడానికే.. మరిన్ని వీడియోలు విడుదల చేశానని ఆమె తెలిపారు. నా వద్ద ఇంకా చాలా వీడియోలు ఉన్నాయని తెలిపారు. గజల్ శ్రీనివాస్ గలీజ్ పనులకు సంబంధించి మొత్తంగా 20 వీడియోలను బాధితురాలు పోలీసులకు సమర్పించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఈ వీడియోలు చూసిన పోలీసులు షాక్ అయ్యారంట…మనిషి అనే వాడు ఇంత దారుణంగా అమ్మాయిలతో..అది కూడ తన ఆఫీస్ వర్కర్స్ తో చేయ్యడం దారుణం అంటున్నారు. తప్పకుండా కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలోను ఆయనపై మండిపడుతున్నారు