ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్‌ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు పాల్పడుతూ నారా చంద్రబాబు డబ్బుకు ఆశపడి టీడీపీలో చేరారు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు.
అయితే, ఓ పక్క ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజలు చుక్కలు చూపిస్తుంటే… మరో పక్క చంద్రబాబు నాయుడు నిరంతరం ప్రజల్లో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఏం చేయాలో తెలీక ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దిక్కుతచడం లేదు. ఇప్పటికే వారిపై ఫిరాయింపు అనే బ్రాండ్ పడిన మాట వాస్తవం. ఇంటింటికీ టీడీపీ, ప్రజలతో ఎమ్మెల్యే వంటి కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండాలంటూ ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంతో.. ప్రజల మధ్యకు వెళ్లిన నేతలకు చీవాట్లు తప్పడం లేదు.
ఇదిలా ఉంటే పామర్రు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పరిస్థితి మరోలా ఉంది. వైసీపీలో గెలిచి భారీ ప్యాకేజీతోపాటు.. 2019 ఎన్నికల్లోనూ టీడీపీ తరుపున టిక్కెట్ ఇస్తానన్న చంద్రబాబు హామీతోనే ఉప్పులేటి కల్పన వైసీపీని వీడి.. టీడీపీలో చేరిందన్న మాట వాస్తవం. అయితే, ఇప్పుడు ఫిరాయింపు కల్పనకు కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. అంతేగాక, పామర్రు టీడీపీ నేత వర్ల రామయ్య, ఉప్పులేటి కల్పనకు వర్గపోరు నడుస్తున్న విషయం తెలిసిందే. అంతేగాక మరో వైపు కాంగ్రెస్ పామర్రునేత డీవై దాస్‌ను చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీంతో ఎవరికి వారు.. తమకే 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే, డీవై దాస్ టీడీపీలో చేరకుముందు వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. కానీ ఇప్పటికే పామర్రు వైసీపీ సమన్వయ కర్త ఉండటంతో అతన్ని మార్చేందుకు జగన్ ఇష్టపడలేదు. దీంతో డీవై దాస్‌కు టీడీపీ గాలం వేసింది.
టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడం వల్లే తాను టీడీపీలో చేరానని, చంద్రబాబు ఇలా వెన్నుపోటు పొడుస్తాడని తాను ఊహించలేదని ఉప్పులేటి కల్పన తన అనుచరవర్గం వద్ద వాపోతుందట. అయితే, మరో పక్క.. ఉప్పులేటి కల్పనకు జరగాల్సిన లాభం జరిగిందని, చంద్రబాబు నుంచి ప్యాకేజీ బాగానే అందిందని చెబుతోంది ఆమె వర్గం.