కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన 102వ చిత్రం జై సింహా లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 95 శాతం పనులు పూర్తైనట్లు అధికారిక సమాచారం. అయితే, ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్‌గా నటించిన నయన తార ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాము నటించచిన చిత్రంలోని హీరోల గురించి.. హీరోయిన్లు చెప్పే మాటలు అంతా ఇంతా కాదు. డేరింగ్, కూల్, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలానే.
అయితే, వాటన్నిటికి విరుద్దంగా నయన తార బాలయ్యపై బాంబ్ పేల్చింది. బాలకృష్ణ తనకు తండ్రితో సమానమని, తనను నేను ఓ ఫ్యామిలీ మెంబర్‌గా భావిస్తానని చెప్తూ ఫీజులు ఎగిరిపోయేలా సెన్షేషనల్ కామెంట్స్ చేస్తోంది. నిజానికి బాలయ్యబాబు వయస్సులో ఎంత పెద్ద హీరో అయినా ఇలా తండ్రితో పోలుస్తూ నయనతార చేసిన వ్యాఖ్యలపై.. బాలయ్యబాబు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.