అన్నదాతల సంక్షేమం కోసం నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న కరెంట్ కష్టాలపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ ఆ దిశగా వేసిన ప్రణాళికలు విజయవంతంగా కార్యరూపం దాల్చాయి. దీని ఫలితంగా రాష్ట్రంలో సేద్యానికి 24 గంటల విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న సీఎం కేసీఆర్ కు.. రైతులు పాలాభిషేకాలు చేస్తున్నారు. అటు ఇంక్రిమెంట్లు ప్రకటించడంపై విద్యుత్ ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడంతో మహబూబాబాద్ జిల్లాలో రైతుల ఆనందానికి అవధులు లేకుండ పోయింది. తొర్రూరు డివిజన్ కేంద్రంలో రైతుసమితి కో ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సేద్యానికి 24 గంటల కరెంట్ ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మహబూబాబాద్ మండలము జమండ్లపల్లి లో రైతులు సీఎం కేసీఆర్, హరీష్ రావు ఫోటో లకు పాలాభిషేకం చేశారు అన్నదాతలు.
ఇటు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేసిన విద్యుత్ ఉద్యోగులు.. సీఎం కేసీఆర్, ఎంపీ కవిత ఫోటో లకు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం మహబూబాబాద్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రైతులతో కలిసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంబురాలు జరుపుకున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో టీఆర్ఎస్ రైతు విభాగం ఆధ్వర్యంలో అన్నదాతలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ జిందాబాద్ అంటూ రైతులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో గల వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సీఎం కేసిఆర్ ఫ్లెక్సీకి రైతులు పాలాభిషేకం చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న సీఎం కేసిఆర్ కు రుణపడి ఉంటామని అన్నదాతలు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో తెలంగాణ జాగృతి యువజన విభాగం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతన్నలు పాలాభిషేకం చేశారు. గతంలో ఇచ్చే నాలుగు గంటలు కూడా సరిగ్గా సరఫరా కాకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉండేదని..కానీ ఇవాళ 24 గంటల పాటు విద్యుత్‌ను ఇవ్వడం గొప్ప విషయమన్నారు.
రైతులకు నిరంతర 24 గంటల ఉచిత కరెంట్ సరఫరా పై ఖమ్మం రైతాంగం హర్షంవ్యక్తం చేస్తోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసలు కురిపిస్తూ.. ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఖమ్మం జిల్లా అల్లీపురంలో పచ్చని పొలాలలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని పాలతో తడిపేశారు. ఈ కార్యక్రమంలో ఐడీసీ చైర్మన్ ఎస్.బీ బేగ్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
మరోవైపు ఇంక్రిమెంట్లు ప్రకటించడంపై విద్యుత్ ఉద్యోగులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ.. సంబురాలు జరుపుకుంటున్నారు. నిర్మల్ జిల్లాలో విద్యుత్ ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇంక్రిమెంట్ ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు. జనగామ జిల్లాలోనూ విద్యుత్ ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. స్థానిక డీఈ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి.. స్వీట్లు తినిపించుకున్నారు. అటు మహబూబాబాద్ జిల్లాలో కేంద్రంలోనూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి విద్యుత్ ఉద్యోగులు పాలాభిషేకం నిర్వహించారు.