నిన్నటి నుంచి తెలుగు ప్రజల నోట్లో నానుతున్న పేరు గజల్ శ్రీనివాస్. అందరూ అతని రాసలీలల గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా అతని వార్తలే ట్రెండింగ్‌లో ఉన్న విషయం విధితమే. అయితే, ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్‌ను మంగళవారం పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. తనను లైంగికంగా వేధించాడంటూ కుమారి అనే రేడియో జాకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి గజల్ గాయకుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గజల్ శ్రీనివాస్‌కు ఈ నెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో, శ్రీనివాస్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఆ విషయం అటు ఉంచితే.. నిన్న రాత్రి జైలులో గజల్ శ్రీనివాస్‌కు అస్సలు నిద్ర పట్టలేదట. అంతేగాక చాలా నీరసంతోనూ కనిపించాడని పోలీసుల సమాచారం. ఎప్పుడూ ప్రముఖులు, సన్మానాలతో బిజీ బిజీగా గడిపే తాను ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఒక్కసారిగా ఇలా జైలుకు వెళ్లడంతో చాలా బాధతో మనస్సులో మదన పడుతూ.. తన తొలిరోజు జైలు జీవితాన్ని గడిపాడట గజల్ శ్రీనివాస్.
తన మనసును కాస్త కుదుట పడుకునేందుకు తనకు జీవనాధారమైన గజల్ కావాలని పోలీసు సిబ్బందిని అడిగాడట శ్రీనివాస్. గజల్ శ్రీనివాస్ వినతికి స్పందించిన పోలీసు సిబ్బంది జైల్లో అలాంటి వాటికి అనుమతి ఇవ్వరని చాలా సున్నితంగా చెప్పినట్లు సమాచారం. అంతేగాక, తనకు గత వారంలో యాక్సిడెంట్ అయిందని, ఈ యాక్సిడెంట్‌లో తనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయాలు మానేందుకు మసాజ్ చేయించాలని వైద్యులు తనకు సూచించారని పోలీసులకు తెలిపాడట శ్రీనివాస్. అంతేగాక, ఇప్పుడు తన ఆరోగ్యం బాగా క్షీణించిందని, తనకు ఇప్పుడు మసాజ్ చేయకపోతే తన ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉన్నందున తనకు మసాజ్ చేయించాలని పోలీసులను కోరడంతో… గజల్ శ్రీనివాస్ కోరికలతో విసుగెత్తిన పోలీసులు.. కాస్త ఘాటుగా సమాధానం చెప్పడంతో.. గజల్ శ్రీనివాస్ కిర్రుమనకుండా ఉండిపోయాడట.